Wednesday 13 January 2021

Andhra Pradesh 25 NEW Districts List and Revenue Divisions 2021

Andhra Pradesh 25 Districts: As we all know, AP Govt was keen on 3 Capitals and decentralization of power among the 3 regions, Rayalaseema, Uttarandhra, and Andhra. Now the govt has also taken the new decision to Re-Organize the districts. Recently, AP Chief minister Y S Jagan Mohan Reddy’s cabinet approved the decision to form a committee to reorganize the existing 13 districts into 25.

andhra-pradesh-25-districts-list

కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయనం జరుగనుంది. వీలైనంత త్వరగా అధ్యయన నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కమిటీ సభ్యులను కోరారు.

Also, Read: AP 175 MLA List with Educational Qualification

Andhra Pradesh to reorganize into 25 NEW Districts and 3 Capitals in 2021, Here Is The List

ఈ కమిటీలో సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్‌ విభాగం సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి, కన్వీనర్‌గా ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కీలక సభ్యులుగా వుంటారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా నిర్ణయంతో 13 జిల్లాలుగా వున్న రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించి 25 జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ చర్చలో 26వ జిల్లా గురించి ప్రస్తావన కూడా వచ్చింది.  సీఎం ఆదేశాల మేరకు అరకును రెండు జిల్లాలు చేయగలమా లేదా అనే విషయంపై అధ్యయనం చేయనున్నారు.

Andhra Pradesh 25 Districts List

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజాధానులు బిల్లును ఆమోదించింది. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా మారనున్నాయి. అయితే ఈ తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు 25 జిల్లాలుగా విస్తరించనుంది.

ఎన్నికల ప్రచార సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఏ జిల్లాలను పునర్వ్యవస్థీకరించినున్నారో తెలియచేశారు. అయితే వాటిలో మార్పు ఉండకపోవచ్చు.

  1. అరకు
  2. అనకాపల్లి
  3. నరసాపురం
  4. అమలాపురం
  5. రాజమండ్రి
  6. నరసరావుపేట
  7. బాపట్ల
  8. రాజంపేట
  9. తిరుపతి
  10. నంద్యాల
  11. హిందూపూర్
  12. విజయవాడ
ఇప్పటికే వున్న 13 జిల్లాలకు కొత్తగా ఏర్పడే ఈ 12 జిల్లాలను జతచేసి 25 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించినున్నారు.

Araku New Districts Proposal

అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 7 నియోజకవర్గాలను విభజించి... 2 జిల్లాలు ఏర్పాటు చెయ్యాలని కమిటీ ప్రతిపాదించింది. అరకు-1 జిల్లాలోకి పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలనూ... అలాగే అరకు-2 జిల్లాకు అరకులోయ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలను తేవాలని కమిటీ ప్రతిపాదించింది. అరకు - 1 జిల్లాకు పార్వతీపురం, అరకు-2 జిల్లాకు పాడేరు,... హిందూపురం జిల్లాకు హిందూపురం లేదా పెనుకొండను జిల్లా కేంద్రాలుగా నియమించాలని కమిటీ ప్రతిపాదించింది.

AP NEW Revenue Divisions

కొత్త జిల్లాలు ఏర్పాటైతే ఇప్పుడున్న 38 రెవెన్యూ డివిజన్లలో మార్పులు చేయాలనీ, కొత్తగా 9 రెవెన్యూ డివిజన్లు తేవాలనీ, అలాగే ఆల్రెడీ ఉన్న వాటిలో 3 రద్దు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. అలాగే... పోలీస్ స్టేషన్ల హద్దులు, పరిధులు కూడా మారనున్నాయి. విద్య, ఆరోగ్యం, అటవీ, వాణిజ్యపన్నులు, ఇంజినీరింగ్ వంటి శాఖల్లో కూడా మార్పులు రానున్నాయి.

రద్దు అయ్యే రెవెన్యూ డివిజన్లు: - పశ్చిమ గోదావరి జిల్లా కుకునూరు డివిజన్ పరిధిలోని పోలవరం నియోజకవర్గ మండలాల్ని... కొత్తగా ఏర్పాటయ్యే జంగారెడ్డి గూడెం డివిజన్‌లోకి చేర్చడం. - తూర్పుగోదావరి జిల్లా ఎటపాక డివిజన్ పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గ మండలాలను కొత్తగా ఏర్పాటయ్యే రంపచోడవరం డివిజన్‌లోకి చేర్చడం. - నెల్లూరు జిల్లా... ఆత్మకూరు నియోజకవర్గ మండలాలను నెల్లూరు డివిజన్‌లోకి... ఆత్మకూరు డివిజన్ పరిధిలోని ఉదయగిరి నియోజకవర్గ మండలాలను కందుకూరు డివిజన్‌లోకి మార్చడం.