Sunday 25 October 2020

AP Government Jagananna Land Survey 2021 Details and Contact Numbers

AP Government Land Survey Complete Details 2021-23: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శాశ్వత భూ హక్కు కల్పనే ధ్యేయంగా సమగ్ర భూ సర్వే చేపట్టడానికి సన్నాహం చేస్తోంది. ఈ సర్వేను పక్కా ప్రణాళికతో నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. 2021 జనవరి 1న భూ సర్వే మొదలు కావాలని, నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

ap-government-jagananna-land-survey

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టనున్న ఈ భూ సర్వే వందేళ్ల తర్వాత జరుగుతోంది. ఈ తాజా సర్వే వల్ల రాష్ట్రంలో భూ రికార్డుల డిజిటలైజేషన్‌ జరుగుతుంది. అత్యాధునిక టెక్నాలజీ, డ్రోన్‌లు, రోవర్స్‌ ఉపయోగించి దేశంలో తొలిసారిగా ఈ సర్వేనిర్వహిస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.

AP Government Jagananna Land Survey 2021 Complete Details and Contact Numbers

► ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1.22 లక్షల చదరపు కిలోమీటర్లలోని వ్యవసాయ భూములు, మున్సిపాలిటీలలో ఈ భూ సర్వే జరగనుంది. డిజిటలైజేషన్‌ చేస్తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఈ సర్వే చేపట్టనున్నారు. అంటే ఈ భూ సర్వే పూర్తయ్యేసరికి ప్రతి భూ యజమాని యొక్క వివరాలు online లోఅందుబాటులోకి వస్తాయి.

► డిజిటలైజేషన్‌ వళ్ళ రికార్డుల టాంపరింగ్ కు అవకాశం ఉండదు

►ఈ సర్వే సంభందించిన రిజిస్ట్రేషన్లు సచివాలయాల్లో కొనసాగుతాయి

AP Government Land Survey 2021

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి మండలంలో మూడు బృందాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4,500 బృందాలు పని చేస్తాయని అధికారులు సీఎంకు వివరించారు.

► భౌగోళిక సమాచార వ్యవస్థ (GIS) ద్వారా శాటిలైట్‌ ఫొటోలు తీస్తారు, అలాగే ఇమేజ్‌ను ప్రాసెస్‌ చేసి క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత సమగ్ర సర్వే సెటిల్‌మెంట్‌ కొనసాగుతుంది.

► డ్రోన్ల ద్వారా గ్రామ కంఠాలను స్పష్టంగా ఫొటోలు తీస్తారు

► 2021 జనవరి 1న ప్రారంభమయ్యే ఈ సమగ్ర భూ సర్వే జనవరి 2023 నాటికి మూడు దశల్లో పూర్తవుతుంది.

► ఈ సర్వే నిర్వహించడానికి 70 Continuously operating reference stations ‌(బేస్‌ స్టేషన్లు) ఏర్పాటు చేయనున్నారు. 

► మొబైల్‌ (విలేజ్‌) కోర్టులు ఏర్పాటు చేసి వివాదాలను ఎక్కడికక్కడ పరిష్కరించనున్నారు

► ఈ భూ సర్వేకు ‘వైఎస్సార్‌–జగనన్న సమగ్ర భూ సర్వే’ లేదా ‘రాజన్న–జగనన్న సమగ్ర భూ సర్వే’ అని పేరు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.

Contact Numbers

Data Related issues :Contact Your Concerned Tahsildar

Technical issues : meebhoomi-ap@gov.in

Also, Read: Andhra Pradesh New Sand Policy 2020